టీజర్: చిన్న కథ కాదు.. సంథింగ్ సంథింగ్

రానా దగ్గుబాటి సమర్పణలో ఓ సినిమా వస్తోంది. అదే.. “35-చిన్న కథ కాదు”. నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నంద కిషోర్ ఈమని డైరెక్టర్. సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా టీజర్ బయటికి వచ్చింది. ‘విలువే లేని సున్నా పక్కన ఒకటి పెడితే అయ్యే పది, తొమ్మిది కంటే పెద్దదని ఎట్లా చెప్తారు’ అని నివేతా థామస్ డైలాగ్ తో మొదలైన టీజర్ ఇంట్రస్టింగ్ గా సాగింది.

ఇదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టొరీ. తారే జమీన్ పర్ స్టయిల్ లో పిల్లలు, ఎడ్యుకేషన్, మార్కులు.. ఇలాంటి ఇతివృత్తంతో సాగే కథని టీజర్ హింట్ ఇస్తోంది. టైటిల్ కి జస్టిఫీకేషన్ ఇస్తూ 35 మార్పులు… చిన్న కథ కాదు అనే డైలాగు రిపీట్ గా వినిపించింది. ఇందులో చిన్న పిల్లాడి ఎమోషన్ కీలకంగా వుంది. ఫండ్మెంటల్స్ ని ప్రశ్నించకూడదని ప్రియదర్శి చెప్పిన డైలాగ్ కూడా కథలో కీలకమని అర్ధమౌతొంది. చిత్తూరు యాసలో సాగే సినిమా ఇది. సంగీతం, కెమరా పనితనం, నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. రానా కొన్ని యూనిక్ కథలకే సమర్పకుడిగా వుంటున్నారు. టీజర్ లో ఐతే కొత్తదనం కనిపించింది. ఆగస్ట్ 15న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

1 COMMENT

Comments are closed.