పెద్ద పెద్ద సమస్యలకి చిన్న చిన్న వినూత్నమయిన పరిష్కారాలు కనుగొనే ప్రధాని నరేంద్ర మోడి దేశంలో ధనికులను గ్యాస్ పై సబ్సీడీని వదులుకోవాలని పిలుపునిచ్చారు. దానికి చాలా మంచి స్పందన వచ్చింది. ధనికులే కాకుండా ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా చాల మంది స్వచ్చందంగా సబ్సీడీ గ్యాస్ ని వదులుకొన్నారు. దాని వలన ప్రభుత్వానికి, చమురు సంస్థలకి కూడా చాలా ఆర్ధిక భారం తగ్గింది.
అలాగే దేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో కేవలం ప్రభుత్వమే కాకుండా కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్తలను, వ్యాపారవేత్తలను కూడా భాగస్వాములుగా చేస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి.ఎస్.ఆర్.) అనే పధకం ప్రారంభించారు. మోడీ పిలుపు మేరకు దేశంలోని 460 కార్పోరేట్ సంస్థలు ముందుకు వచ్చేయి.
అవి 2015-16 ఆర్ధిక సం.లలో రూ. 8,347.47 కోట్లు విరాళాలుగా ఇచ్చేయని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. అవి ఇచ్చిన ఆ నిధులలో ఇంతవరకు సుమారు 75 శాతం ఖర్చు చేసామని చెప్పారు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ఈ నిధులను ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ పధకంలో కార్పోరేట్ సంస్థలు నేరుగా ప్రధానమంత్రి సహాయ నిధికి జమ చేసే అవకాశం కలిగించడంతో మంచి స్పందన వస్తోందని చెప్పారు.