అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొట్టుకుపోవడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. అధికారిక లెక్కల ప్రకారం 48 మంది చనిపోయినట్లుగా తేల్చారు. చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడి వారి బాధలు చూసి చలిపోయారు. మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రూ. లక్ష చొప్పున సాయం ప్రకటించారు. అప్పటికి ఎన్టీఆర్ ట్రస్ట్ పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలను చేపట్టింది. వారి సేవలు బాధితుల ప్రశంసలు అందుకున్నాయి..
ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం.. ఎన్టీఆర్ ట్రస్ట్ బాధితుల కుటుంబసభ్యులకు చెక్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తిరుపతిలో జరగనున్న కార్యక్రమంలో రూ. 48 లక్షలను… మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి పంపిణీ చేస్తారు. ప్రభుత్వం రూ. ఐదు లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది.
అయితే… అన్నమయ్య, పించా ప్రాజెక్టులు కొట్టుకుపోవడం వల్ల తీరని నష్టం జరిగింది. అక్కడి కుటుంబాలకు ఎంత సాయం చేసినా… పూడ్చలేనంత నష్టం జరిగింది.అందుకే స్వచ్చందసంస్థలు కూడా పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ఆ సేవలో భాగం అయింది. సుదీర్ఘ కాలంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆపన్నులకు సాయం అందిస్తోంది. కరోనా కాలంలోనూ పెద్ద ఎత్తున ఆపన్నులకు సాయం చేశారు.