తెలుగునాట సంచలనాలు సృష్టించింది బాహుబలి. ఆ ప్రభంజనం చూసి బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. అక్కడా వంద కోట్లు కొల్లగొట్టి… తెలుగు సినిమా స్టామినా చాటి చెప్పింది బాహుబలి. ఆ తరవాత పలు అంతర్జాతీయ వేదికపై బాహుబలి ప్రదర్శితమై అక్కడా ప్రసంశలు అందుకొంది. బాహుబలి సినిమాని చైనాలో విడుదల చేయాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది బాహుబలి టీమ్. గత ఆరు నెలలుగా అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. అది ఇప్పుడు కొలిక్కి వచ్చింది. చైనాలో బాహుబలి విడుదల తేదీ ఖరారైంది. జులై 22న ఏకంగా 5 వేల థియేటర్లలో బాహుబలిని విడుదల చేస్తున్నారు. ఓ విదేశీ చిత్రం చైనాలో ఇన్ని స్క్రీన్స్‌లలో విడుదల అవ్వడం ఇదే తొలిసారి. మరి చైనాలో బాహుబలి ఏమేర ప్రభంజనం సృష్టిస్తుందో, ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో తెలియాలంటే.. మరి కొద్దిరోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం బాహుబలి 2 పనుల్లో బిజీగా ఉంది జక్కన్న టీమ్. రామోజీ ఫిల్మ్‌సిటీలో బాహుబలి 2 క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. పార్ట్ 1కి చైనాలో దక్కిన ఆదరణ చూసి.. బాహుబలి 2ని అక్కడ ఏ స్థాయిలో విడుదల చేయాలన్నది ఆలోచిస్తారు. చైనా స్క్రీనింగ్ కోసం బాహుబలి సినిమాని రీ ఎడిట్ చేసినట్టు సమాచారం.