తెలంగాణ సర్కార్ 59 పేజీల మీడియా బులెటిన్ విడుదల చేసింది. ప్రజలకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంచడం లేదని… ఏం చేయాలో నేరుగా సీఎస్‌నే అడుగుతామని… హైకోర్టు ధర్మానసం వ్యాఖ్యానించిన సందర్భంలో.. అధికారులు రూటు మార్చారు. రాత్రికి రాత్రి మీడియా బులెటిన్ ఫార్మాట్ మార్చేశారు. సమగ్ర, సంపూర్ణ సమాచారంతో కూడిన బులెటిన్‌ను మీడియాకు విడుదల చేశారు. అది ఏకంగా… పుస్తకం అంత ఉంది. కరెక్ట్‌గా చెప్పాలంటే.. 59 పేజీలు ఉంది. ఇందులో ఆ రోజు ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చాయన్నద దగ్గర్నుంచి ప్రారంభించి..ఎక్కడెక్కడ పరీక్షలు చేస్తున్నారు.. ఏ తరహా పరీక్షలు చేస్తున్నారు … ఆస్పత్రుల్లో బెడ్ల సమాచారం .. జిల్లాల్లో ఆస్పత్రుల వివరాలు అన్నీ పొందు పరిచారు.
అయితే.. ప్రభుత్వం..సీరియస్‌గా ఈ బులెటిన్ విడుదల చేసినట్లుగా లేదు. హైకోర్టు ఆదేశాల విషయంలో ఆగ్రహంతో.. సైటైరిక్గా.. ఈ బులెటిన్ విడుదల చేసినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 59 పేజీల బులెటిన్ అంటేనే.. ఉన్న సీరియస్ నెస్ కాస్తా కామెడీ అయ్యేలా ఉంది. ప్రభుత్వం… ప్రజలకు అవసరమైన.. సమాచారాన్ని .. ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతోంది కానీ.. ఆస్పత్రుల వివరాలు కాదు. కానీ… హైకోర్టు ఏం చెబుతుందో కానీ.. ప్రభుత్వం మాత్రం… తెలంగాణకు సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారాన్ని బులెటిన్గా మీడియాకు పంపేసింది.
కరోనా విషయంలో ప్రభుత్వ పనితీరుపై… మీడియా సంస్థలు …వ్యాఖ్యానించడానికి సిద్ధంగా లేవు. అందుకే సామాన్యులు… పెద్ద ఎత్తున ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. వాటిని విచారణకు స్వీకరిస్తున్న హైకోర్టు.. ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తోంది. హైకోర్టు అభిప్రాయాలను.. వ్యాఖ్యలకు తగ్గట్లుగా తదుపరి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. అధికారులు.. ఓ సారి తామే రివర్స్‌లో హైకోర్టు వల్ల ఇబ్బంది పడుతున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. సమాచారం పూర్తిగా ఇవ్వట్లేదంటే… ఇలా.. ఆస్పత్రుల వివరాలతో 59 పేజీల బులెటిన్ విడుదల చేశారు. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో నన్న ఆసక్తి తెలంగాణలో ఏర్పడింది.