లాక్ డౌన్, కరోనా వల్ల బడ్జెట్లు తగ్గుతాయి.నిర్మాతలంతా పొదుపు మంత్రం పాటిస్తారనుకుంటే.. ఎవ్వరూ తగ్గడం లేదు. చిన్న సినిమాలకు కూడా భారీగా ఖర్చు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘అహం బ్రహ్మస్మి’లో కూడా అంతే. మంచు మనోజ్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. పాన్ ఇండియా ట్యాగ్ లైన్తో ఈ సినిమా విడుదల కాబోతోంది.
అందుకోసం భారీ హంగులు జోడిస్తున్నారు. ఓ పోరాట ఘట్టం కోసం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు పెడుతున్నార్ట. ఈ ఫైటింగ్ని యాక్షన్ కొరియో గ్రాఫర్ పీటర్ హెయిన్స్ తెరకెక్కించనున్నారు. ఏకంగా యాభై రోజుల పాటు ఈ ఫైట్ తీస్తారని మంచు మనోజ్ తెలిపారు. ”నేనూ. పీటర్ కలసి పనిచేయడం ఇదే తొలిసారి. అందుకే ఆ ఫైట్ ని కొత్తగా చూపించాలని ప్రయత్నిస్తున్నాం. నేనెప్పుడూ ఇది వరకు చేయని ఫైట్స్.. ఈ సినిమాలో చూస్తారు. కత్తిసాము, కర్రసాము, గుర్రపు సవారీ, ఛేజింగులు ఇలా.. ఈ ఫైటులో అన్నీ చూస్తారు” అని చెప్పుకొచ్చాడు మనోజ్.