రామ్ పోతినేని , కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించగా ఇటీవల విడుదలైన వారియర్ సినిమా దర్శకుడు లింగ స్వామికి చెన్నై కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే..
లింగస్వామి అంటే ఒకప్పుడు దక్షిణ భారత హీరోలు పడి చచ్చేవారు. పందెంకోడి, రన్ వంటి సినిమాలు విశాల్, మాధవన్ లాంటి హీరోలకు ఉన్నపళంగా మాస్ లో మంచి బేస్ తెచ్చిపెట్టాయి. అయితే ఆ తర్వాత ఆయన ఫామ్ కోల్పోయారు. అయినప్పటికీ, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరో లు లింగుస్వామి దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపారు. కానీ లింగుస్వామి కథ తో వారిని మెప్పించ లేక పోయారు. దీంతో ఆయన అదే కథని రామ్ పోతినేని తో తీసారు. అయితే ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల జడ్జ్మెంట్ కరెక్ట్ అనిపించేలా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. కెరీర్ పరంగా ఉన్న ఈ ఒడిదుడుకులు చాలవు అన్నట్లు ఇప్పుడు తాజాగా లింగస్వామి కి కోర్టు జైలు శిక్ష విధించడం చర్చనీయాంశం గా మారింది.
గతంలో పివిపి క్యాపిటల్ నుంచి లింగస్వామి మరియు అతని సోదరుడు కోటి ముప్పై ఐదు లక్షల దాకా డబ్బులు తీసుకున్నారని, అయితే ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోగా ఎట్టకేలకు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడంతో ఆ సంస్థ లింగస్వామి మరియు అతని సోదరుడు సుభాష్ పై కోర్టుకు వెళ్లారు. కేస్ పరిశీలించిన సైదాపేట్ కోర్టు వీరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే లింగు స్వామి మరియు అతని సోదరుడు పై కోర్టుకు అప్పిలుకు వెళ్లనున్నట్లు సమాచారం.
మొత్తానికి లింగస్వామి స్థాయి దర్శకుడి కి ఇలాంటి శిక్ష పడటం చర్చనీయాంశం గా మారింది.