చిరంజీవి 150వ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో చిరు సినిమాకి క్లాప్ కొట్టబోతున్నారు. ఈ లోగా స్ర్కిప్టులో మార్పులూ చేర్పులూ చోటు చేసుకొంటున్నాయి. ఈ మధ్య చిత్ర విజయంలో డైలాగులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందునా చిరంజీవి సినిమాలో డైలాగులంటే ఓ రేంజులో ఉండాల్సిందే. అందుకు తగ్గట్టే వినాయక్ కూడా పలు జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ సినిమా కోసం ఆరుగురు రైటర్లతో డైలాగులు రాయిస్తున్నారట. పరుచూరి బ్రదర్స్, ఆకుల శివ, బుర్రా సాయిమాధవ్‌తో సహా మరో ఇద్దరు రైటర్లు ఈ స్ర్కిప్టుపై కూర్చున్నారట.
పొలిటికల్ టచ్ ఉన్న డైలాగుల్ని పరుచూరి బ్రదర్స్ రాశారని టాక్. ఎమోషన్ సీన్స్ రాసే బాధ్యత బుర్రా సాయిమాధవ్‌కి అప్పగించార్ట. ఆకుల శివ కామెడీ టచ్ ఉన్న డైలాగులు రాశారట. మరో ఇద్దరు యంగ్ రైటర్లు కూడా పెన్ను చేసుకొన్నారని తెలుస్తోంది. ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలన్న ధ్యేయంతోనే వినాయక్ ఇంతమంది రచయితల్ని టీమ్‌లోకి తీసుకొన్నాడట వినాయక్. బ్రహ్మోత్సవం సినిమాకీ ఇంతే. ఐదారుగురు రచయితలు వర్క్ చేశారు. ఫలితమేమో తేడా కొట్టేసింది. మరి చిరు సినిమాకి ఏమవుతుందో చూడాలి.