ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని థానే స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అందుకోసం ఏపి సీ.ఎం.ఓ.కార్యాలయ అధికారులు తెలంగాణా ఏపి సీ.ఎం.ఓ.కార్యాలయ అధికారులకి ఇవ్వాళ్ళ ఫోన్ చేసి రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ తీసుకొన్నారు. చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం తిరుమలలో తన మనుమడు దేవాన్ష్ అన్నప్రాసన కార్యక్రమం ముగించుకొన్న తరువాత హైదరాబాద్ చేరుకొంటారు. సాయంత్రం ఐదు గంటలకి రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్ న్ని శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. ఆ తరువాత అక్కడి నుండి కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనను స్వయంగా ఆహ్వానిస్తారు. మళ్ళీ చాలా రోజుల తరువాత ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య కొంత సహృద్భావా వాతావరణం నెలకొనడంతో ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.