రామ్ – పూరి కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ వేసవి బరిలో నిలిచింది. ఈ సినిమా కోసం ఇటీవల ముంబైలో క్లైమాక్స్ ఫైట్ షూట్ చేశారు. ఇందుకోసం ఓ భారీ సెట్ రూపొందించారు. ఈ ఫైట్ కోసమే దాదాపు రూ.7.5 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ నేతృత్వంలో 12 రోజుల పాటు ఈ ఫైట్‌ని వందలాది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్ల మధ్య రూపొందించారు. పూరి కెరీర్లోనే అత్యంత భారీ ఖర్చుతో రూపొందించిన ఫైట్ ఇది.
సాధారణంగా పూరి చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ టైమ్‌లో, మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ ఫైట్… భారీ బడ్జెట్ ని డిమాండ్ చేసింది. విలన్‌గా సంజయ్‌దత్ ఉండడంతో.. ఆ క్రేజ్‌కి తగ్గట్టుగానే ఈ ఫైట్‌పై ఖర్చు పెట్టాడు పూరి. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి మణిశర్మ సంగీతం చాలా ప్లస్ అయ్యింది. ఈ సీక్వెల్ కీ ఆయనే స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే 3 పాటలు ఇచ్చేశారు. మరో రెండు పాటలు ఇవ్వాల్సివుంది. ప్రస్తుతం పూరి – మణి మధ్య మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. త్వరలోనే మిగిలిన ఆ రెండు పాటల్నీ తెరకెక్కిస్తారు.