ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ వైరస్ కేసులు గత ఇరవై నాలుగు గంటల్లో మరో 73 వెలుగు చూశాయి. నిన్నటి టెస్టుల్లో సీరియస్ కోణం… ఏపీలో ఉన్న పదమూడు జిల్లాల్లో.. పదకొండు జిల్లాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో మాత్రమే నిన్న కొత్త కేసులు నమోదు కాలేదు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే గుంటూరులో అత్యధికంగా 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 13, కర్నూలులో 11 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఏపీలో మొత్తం 1332 పాజిటివ్ కేసులు నమోదవగా.. 31 మంది చనిపోయారు. 287 మంది డిశ్చార్జ్ అయ్యారు. అంటే ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1014 ఉన్నాయి. ఏపీ సర్కార్ టెస్టుల సంఖ్యను అనూహ్యగా పెంచుకుంటూ పోతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో 7727 శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
హాట్ స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని…. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా హాట్ స్పాట్లు పెరగకుండా చూసుకుంటామని చెబుతున్నారు. అయితే.. నిన్నామొన్నటి వరకూ.. కొన్ని జిల్లాల్లోనే కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్క విజయనగరం జిల్లా మినహా అన్నింటా కొత్త కేసులు నమోదవడం అధికారవర్గాలను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. లాక్ డౌన్ ప్రకటింంచిన నెల వరకూ ఒక్క కేసు లేని శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఐదు కేసులు నమోదయ్యాయి. విశాఖలో దాదాపుగా అందరూ డిశ్చార్జ్ అయ్యారనుకునేలోపు కొత్త కేసు నమోదయింది.
ప్రభుత్వం మాత్రం.. చేస్తున్న టెస్టులతో పోలిస్తే.. ఏపీలో.. పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువని చెబుతోంది. దేశం మొత్త చేస్తున్న టెస్టులతో పోలిస్తే.. పాజిటివ్ రేటు మూడు శాతం వరకూ ఉంటే.. అది ఏపీలో ఒకటిన్నర శాతమే ఉందని… దీన్ని బట్టి చూస్తేనే..ఏపీలో వైరస్ విసృతి తక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చంటున్నారు. సంఖ్యా పరంగా మాత్రం.. ఏపీలో రోజుకు సగటున 70 నుంచి 8