దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి.. వీలైనంత త్వరగా బయటపడాలంటే.. సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా ఆమలు చేయాలన్న ఆలోచనకు వచ్చారు. ముఖ్యంగా తనకు ఇంతకు ముందు ఘన విజయాలు సాధించి పెట్టిన రైతు బంధు పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సారి ఎప్పుడూ లేని విధంగా రైతు బంధు పథకం కోసం రూ. 7300 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ ఇరవై ఏడో తేదీ నుంచి వచ్చే ఏడో తేదీ వరకూ… రైతులందరికీ.. పథకం నిధులు జమ చేయాలని ఆదేసించారు. ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ.. నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులను జమ చేయాలనిన్న కేసీఆర్ స్పష్టం చేశారు.
తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి.. ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులందరికీ 10 రోజుల్లో డబ్బులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకున్న తర్వాత కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. 2018 మొదట్లో తొలి విడత పంపిణీ చేశారు. రెండో విడత పంపిణీ చేసే సమయానికి ముందస్తు ఎన్నికలు పెట్టారు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నప్పటికీ.. నిధుల పంపిణీకి ఆటంకం లేకుండా పోయింది. ఈ నిధులు కేసీఆర్ విజయానికి కారణం అయ్యాయన్న చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత పథకం పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు.
2019లో మొదటి విడత రైతు బంధు నిధులు సగం మంది వరకూ జమ కాలేదు. రెండో విడత రైతు బంధు నిధుల విషయంపై కూడా అంతే అసంతృప్తి ఉంది. అయితే.. ఈ సారి మాత్రం అలాంటి పరిస్థితులు రాకూడదని.. కేసీఆర్ నిర్ణయించారు. మామూలుగా అయితే.. ఈ పాటికి రైతు బంధు నిధులు పంపిణీ చేయాల్సి ఉంది. అక్టోబర్-నవంబర్లోనే పంపిణీ చేస్తారు. ఈ సారి ఆలస్యంగా విడుదల చేస్తున్నారు.