ఆంధ్రప్రదేశ్లో ఓటరు చైతన్యం వెల్లి విరిసింది. కొత్త ఓటర్లతో పాటు యువత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడంతో పోలింగ్ ఊహించనంతగా పెరిగింది. గత ఎన్నికల్లో 79 శాతం ఈవీఎం ఓటింగ్ నమోదయింది. ఇలా నమోదవడానికి అర్థరాత్రి వరకూ చాలా చోట్ల పోలింగ్ జరిగింది. ఈ సారి కూడా చాలా కేంద్రాల్లో అర్థరాత్రి వరకూ పోలింగ్ జరిగింది. అనధికారిక లెక్కల ప్రకారం 82 శాతం వరకూ పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల నాటి కన్నా పెరుగుతుందని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు.
ఈవీఎంలు,పోస్టల్ బ్యాలెట్లు కలుపుకుంటే.. 85 శాతం ఓటింగ్ నమోదవుతుందని పోల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మామూలుుగా అయితే ప్రభుత్వానికి పాజిటివ్ గా ఓట్లేయాలనుకునేవారు ఎలా పెద్దఎత్తున తరలి రారు. కానీ వ్యతిరేకంగా ఓటేయాలని అనుకుంటే మాత్రం వస్తారు. పోలింగ్ శాతం పెరిగితే అదే ట్రెండ్ గా భావిస్తున్నారు. 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంతో.. టీడీపీ నష్టపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వెల్లువలా వచ్చింది.
సజ్జల రామకృష్ణారెడ్డి కూడాఅదే చెబుతున్నారు. సాధారణంగా ఎక్కువ ఓటింగ్ జరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటేనంటున్నారు. కానీ ఆయన ఈ సారి పాజిటివ్ ఓటు పడిందని పార్టీ నేతలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చరిత్రలో ఎగేసుకుని వచ్చి ప్రజలు పాజిటివ్ ఓట్లు వేసిన సందర్భాలు లేవని ఆయనే చెబుతున్నారు. మొత్తంగా ఎనభై ఐదు శాతం పోలింగ్ నమోదు అయితే.. వైసీపీ తుడిచి పెట్టుకుపోతుందని పోల్ నిపుణులు విశ్లేషించారు. దాని ప్రకారం.. వచ్చే ఫలితాలపై ఓ అంచనాకు రావొచ్చు.