1983 ఇండియన్ క్యాలెండర్ ఓ హిస్టారికల్ ఇయర్. 1983 అనగానే కపిల్ దేవ్ వరల్డ్ కప్ పట్టుకున్న ఇమేజ్ కళ్ళ ముందు కదులుతుంది. అదో హిస్టారికల్ మూమెంట్. ఇప్పుడా ఘట్టాన్ని వెండితెరపై చూడబోతున్నాం. లజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన సినిమా83’. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేయనున్నారు.
ఈనేపథ్యంలో తాజాగా ‘83’ టీజర్‌ను అక్కినేని నాగార్జున ట్విటర్ వేదికగా విడుదల చేశారు. 1983లో భారత్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ అందుకోవడానికి కారణమైన క్యాచ్‌ని ఈ టీజర్ లో చూపించారు. టీజర్ చివర్లో ఇండియా జిందాబాద్ అనే నినాదాలు ఒక్కసారిగా దేశ భక్తిని రగిలించడంతో పాటు .. అలనాటి రోజులు గుర్తుకు తెచ్చాయి. కబీర్‌ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో కపిల్‌దేవ్ భార్య పాత్రలో దీపికా పదుకొణె కనిపించనుంది. ఈ బయోపిక్ పై భారీ అంచనాలు వున్నాయి.