సీఎం జగన్ ఎన్నికలు దగ్గరకు వచ్చే టప్పటికీ ఏం చేయాలో తెలియక చిత్రమైన జిమ్మిక్కులు ప్లే చేస్తున్నారు. ఐదేళ్ల కిందట తాను రాగానే పెన్షన్ మూడు వేలు చేస్తానని ప్రకటించిన ఆయన ఎన్నికలకు వెళ్లే ఒక్క నెల ముందు మూడు వేలు చేస్తున్నరు. ఈ సారి రూ. 250 పెంచుతున్నారు. ఈ పెంపుదలను ఆయన ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారు. ఏకంగా ఎనిమిది రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. అందులోనూ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొనాలని అవ్వాతాతలకు తన పేరుపై ఇస్తున్న లేఖను ఇచ్చి చదివి వినిపించాలని కూడా ఆదేశించారు. 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ. 400 పెన్షన్ ఉండేది.
దాన్ని అధికారంలోకి రాగానే వెయ్యి చేశారు. నాలుగేళ్ల తర్వాత ఎన్నికలకు ఆరు నెలల ముందు రెండు వేలు చేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 250 పెంచారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు పెంచలేదు. ఇప్పుడు మళ్లీ 250 పెంచుతూ.. తన హామీని నెరవేర్చానని సంబరాలు చేస్తున్నారు. మూడు నెలల కిందటే ఇవ్వాల్సిన చేయూత పథకాన్ని పెండింగ్ లో పెట్టి వచ్చేనెలలో ఇస్తామంటున్నారు. దానికి కూడా వారం రోజులు సంబరాలు చేస్తున్నారు.
ఆసరా కూడా అంతే. జగన్ రెడ్డి తీరు చూసి.. వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఇచ్చే పాత పథకాలకు కొత్తగా హడావుడి చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని వారు మథనపడుతున్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పట్టించుకోకుండా.. తమ సోది తాము చెప్పుకుంంటూ పోతే ఎలా అనివారు నిట్టూరుస్తున్నార. ఎన్నికలకు ముందు కొత్త అప్పుల కోసం జగన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అవి అనుకున్నంతగా దొరకకపోతే. బటన్లు నొక్కుతారు కాబట్టి డబ్బులు జమ కావు.