కొంతమందికి మందుతాగడం సరదా
ఇంకొంతమందికి జీవితం
కానీ అతనికి మాత్రం అవసరం.
ఎందుకంటే.. పూట పూటకో పెగ్గు పడకపోతే.. అతని ప్రాణానికే ముప్పు. అలాంటి కుర్రాడి జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. తనకేమో మందంటే చిరాకు. తనకే కాదు. ఫ్యామిలీ మొత్తం యాంటీ ఆల్కాహాలిక్కే. అలాంటి కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయిని హీరో ప్రేమిస్తే ఏమవుతుంది? అనేదే 90 ఎం.ఎల్ కథ. కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నేహా సోలంకీ కథానాయిక. డిసెంబరు 5న ఈ చిత్రం విడుదల అవుతోంది. ట్రైలర్‌ని కొద్ద సేపటి క్రితమే వదిలారు.
హీరో క్యారెక్టరైజేషన్ ఏమిటి? ఈ కథ స్లాట్ ఏమిటి? కథలో సంఘర్షణ ఏమిటన్నది ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. దానికి తోడు.. విలన్ క్యారెక్టరైజేషన్‌ని కూడా కొత్తగానే వాడుకున్నారనిపిస్తోంది. మత్తయ సువార్త, ఆరో వచనం అంటూ విలన్ పలికే మాటలు కామెడీ పంచుతాయి. ట్రైలర్ రిచ్‌గా కనిపిస్తోంది. ఒకట్రెండు పాటలు విడుదలకు ముందే క్లిక్ అయ్యాయి. `ఆర్ ఎక్స్ 100`తో కార్తికేయ క్లిక్ అయినట్టే కనిపించాడు. అయితే ఆ తరవాత వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. `గ్యాంగ్ లీడర్`లో విలన్‌గా చేసినా ఆ ప్రయోగం సత్ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. పైగా మరోసారి సొంత సంస్థలో తీస్తున్న సినిమా ఇది. మరి అంతిమ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.