ఎనర్జిటిక్ స్టార్ రామ్ భవిష్యత్తు అస్థవ్యస్థంగా ఉన్నదన్నది వాస్తవం.. మొదట్లో సినిమాల విషయంలో చాలా జాగ్రత్త పడ్డ రామ్ రాను రాను సినిమాల్లో తన జోక్యం ఎక్కువయ్యేసరికి సినిమాలు ఊహించని విధంగా విఫలమవుతున్నాయి. పండగ చేస్కో సినిమా పర్వాలేదనిపించినా శివం సినిమా రామ్ కి పెద్ద షాక్ ఇచ్చింది. అయితే రామ్ విఫలమవ్వడానికి కారణం తను పరిచయం చేసే కొత్త దర్శకులే అనే సందేహం కలుగుతున్నా సినిమాల్లో తన జోక్యం ఎక్కువ కాబట్టే సినిమాలన్ని ప్రేక్షకాదరణ నోచుకోవట్లేదన్నది లోపల మాట.
అందుకే తనకు ఇంతకుముందు హిట్ ఇచ్చిన దర్శకులతోనే మళ్లీ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు రామ్. బ్రూస్ లీతో ఢీలా పడ్డ శ్రీనువైట్లతో చర్చలు కొనసాగిస్తున్న రామ్ మళ్లీ రెడీ లాంటి కథతో స్క్రిప్ట్ రెడీ చేయమన్నట్టు తెలుస్తుంది. ఇక ఆ దారిలోనే తనకు కందిరీగ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ తో కూడా ఓ సినిమా చేసేందుకు ఆలోచనలో ఉన్నాడట రామ్.
ప్రస్తుతం రామ్ చేస్తున్న సినిమా నేను శైలజా (వర్కింగ్ టైటిల్) జనవరిలో విడుదల అవుతుంది. రచయితగా ఉన్న తిరుమల కిశోర్ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలనే చూస్తున్నాడు. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. ఇకనుండైనా కథల విషయంలో జాగ్రత్త పడి రామ్ ఆలోచించి సినిమాలు తీస్తే బెటర్ లేదంటే ప్రేక్షకులు రామ్ సినిమా అంటే వద్దు బాబోయ్ అనే చాన్స్ ఉంది. మరి ఈ ఇద్దరు దర్శకులైన సరే రామ్ తలరాతని మార్చుతారా అన్నది ఇప్పుడు సగటు సిని ప్రేమికుడు ప్రశ్న..!