గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథతో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’. అయితే సినిమా విషయంలో అభ్యంతరాలను తెలియచేస్తూ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కోర్ట్ ని ఆశ్రయించడం జరిగింది. వర్మ వీరప్పన్ సినిమాను కేవలం హిందీలో మాత్రమే తీస్తా అని తమ దగ్గర ఆమోదం పొందాడని.. ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మించడంతో అసహనం వ్యక్తపరుస్తూ కోర్టుకి ఫిర్యాదు చేసింది ముత్తులక్ష్మి.
అంతేకాదు వర్మ సినిమాని రిలీజ్ ఆపేయాలని కూడా డిమాండ్ చేస్తుంది ఈమె. మరి ఈ వివాదం నుండి వర్మ ఎలా బయట పడతాడో చూడాలి. అయితే వీరప్పన్ జీవిత కథతో తీసే సినిమా గురించి కన్నడ దర్శకుడు 7 ఏళ్ల క్రితమే ఆమెకు 31 లక్ష రూపాయలు ఇచ్చాడట. ఇప్పుడు ఆయన కూడా వర్మ కిల్లింగ్ వీరప్పన్ పై అభ్యంతరం వ్యక్తపరిచే అవకాశం ఉంది.
వర్మ కి ముత్తు లక్ష్మి ఇచ్చిన షాక్ కి ఏం చేయాలో తోచని పరిస్థితి అయ్యింది. అయితే సినిమా విడుదల దగ్గర పడుతున్న ఈ సమయంలో ఇలాంటి అభియోగాలు చేయడం వల్ల సినిమా విడుదల అవుతుందా లేదా అన్నది కాస్త ఉద్రిక్తతగా మారింది. సినిమా విడుదల ముందు ముత్తు లక్ష్మి చూశాకే మూవీ వదలాలని కూడా వర్మకు ఆమె చెప్పిందట. మరి ఈ వాదనల నుండి సినిమా విడుదల అవుతుందో లేదో చూడాలి.