మాజీ కేంద్రమంత్రి మరియు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా రెండు రోజుల క్రితం చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. “పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ కే చెందుతుంది. గత ఆరు దశాబ్దాలుగా అది పాకిస్తాన్ ఆధీనంలోనే ఉంది. ఇక ముందు కూడా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ భారత్ కి చెందుతుంది. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ కే చెందుతుంది. కనుక దానిపై హక్కు ఉందని భారత్ వాదించడం మానుకొని రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి పాకిస్తాన్ తో చర్చలు మొదలుపెట్టాలని ఆయన సలహా ఇచ్చేరు. అందుకు ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మళ్ళీ ఈరోజు మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. భారత్ ఆర్మీ అంతా కలిసి పోరాడినా వారికి ఉగ్రవాదులను అడ్డుకోలేరు,” అని అన్నారు.