మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సి.ఈ.ఓ. సత్య నాదెళ్ళ డిశంబరులో హైదరాబాద్ రాబోతున్నారు. అయితే ఇంకా తేదీలు, ఆయన షెడ్యూల్ ఇంకా ఖరారు కావలసి ఉంది. మైక్రోసాఫ్ట్ సంస్థకి సి.ఈ.ఓ.బాధ్యతలు చేపట్టిన తరువాత రెండవసారి ఆయన హైదరాబాద్ వస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులిరువురినీ కలుసుకొంటారు. తన ఈ పర్యటనలో హైదరాబాద్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ డెవెలప్మెంట్ సెంటర్ కి వెళ్లి అక్కడ పనులను పరిశీలిస్తారు. రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రంగా ఏర్పడినందున ఆంధ్రప్రదేశ్ లో కూడా మైక్రోసాఫ్ట్ సంస్థను నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకు సత్య నాదెళ్ళను కలిసినప్పుడు విజ్ఞప్తి చేసారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వార్తలు వచ్చేయి. కనుక ఈసారి తన పర్యటనలో రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ లేదా దాని అనుబంధ సంస్థ ఏదయినా ఏర్పాటు చేయబోతున్నట్లు సత్య నాదెళ్ళ ప్రకటిస్తారేమో చూడాలి.