ప్రస్తుతం సినిమా ఎలా తీశామన్నది కాదు.. దాన్ని ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లామన్నదే అసలు విషయం అనే సంగతి మన దర్శక నిర్మాతలు బాగా తెలిసొచ్చినట్టు ఉంది.. అందుకే సినిమాను ప్రేక్షకుల్లో తీసుకెళ్లే విధానాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రవితేజ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ‘బెంగాల్ టైగర్’. తమన్నా, రాశి ఖన్నాలు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా రచ్చ ఫేం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు.
రచ్చ సినిమా తర్వాత ఏకంగా పవర్ స్టార్ సినిమాకే దర్శకుడిగా నియమించబడ్డ సంపత్ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా నుండి బయటకు రావాల్సి వచ్చింది. ఆ కసి మీదే బెంగాల్ టైగర్ తీసిన దర్శకుడు సంపత్, సినిమాను ఎలాగైనా ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతున్నాడు. సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రసార మాధ్యమాలతో పాటు రవాణా శాఖని కూడా వాడుతున్నారు దర్శక నిర్మాతలు. ఆ దారిలోనే ఇప్పటికే బస్ ల మీద సినిమా పోస్టర్స్ ని అంటిస్తూ ప్రచారం చేస్తుంటే.. ఇప్పుడు అది ట్రైన్లకి కూడా పాకింది.
ట్రైన్లో అయితే ఇంకా ఎక్కువ జనాలు సినిమా గురించి మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుందని చిత్ర యూనిట్ ట్రైన్ ప్రచారం స్టార్ట్ చేశారు. సైజ్ జీరోతో మొదలైన ఈ ట్రైన్ ప్రచారం ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న బెంగాల్ టైగర్ కూడా చేస్తుంది. వినూత్నంగా ఉన్న ఈ ప్రచారం కిక్-2 అపజయభారాన్ని బెంగాల్ టైగర్ హిట్ తో కడిగేయాలనుకుంటున్న రవితేజకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.