హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సాగు, తాగునీటి కోసం ఎల్మినేడు గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేస్తున్న శతచండీ యాగంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ రామ్మోహనరావుతో సహా రామోజీరావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కిషన్ రెడ్డి వారిద్దరినీ పట్టు కండువాతో సత్కరించారు. యాగంలో భాగంగా నిన్న ఉదయం వేదపారాయణం నిర్వహించి నవగ్రహ జపాలు చేశారు. చండీ హోమం చేసి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. కిషన్ రెడ్డి తన కుటుంబీకులతో సహా లక్ష బిల్వార్చనలో పాల్గొన్నారు. తెలంగాణ హోమ్ మంత్రి నాయని నరసింహారెడ్డి కూడా ఈ యాగంలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి శివన్నగూడ రిజర్వాయర్నుంచి నీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు. లెఫ్టిస్ట్ భావజాలం కలిగిన రామోజీరావు గతంలో ఎప్పుడూ ఇలా పూజలకు, వ్రతాలకు హాజరయ్యేవారు కాదు. అయితే ఇటీవలి కాలంలో గుళ్ళకు, పూజలకు హాజరవుతున్నారు.