సినిమా వాళ్ల దగ్గర పనిచేసే వారిని చిత్రవద చేస్తారన్న వాదనలు ఉన్నాయి. అయితే అది అందరి విషయంలో కాదు లేండి.. మొన్నటికి మొన్న మన స్వీటీ అనుష్క తన కార్ డ్రైవర్ కూతురి వివాహానికి డబ్బు సాయం చేసిందన్న సంగతి తెలిసిందే. ఆ దారిలోనె బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ వినూత్నంగా తన దగ్గర పనిచేసే సిబ్బందికి నీడను ఏర్పరచే ప్రయత్నం చేస్తున్నాడట. కొద్దికాలంగా పాత్రికేయుల మీద కోపాన్ని ప్రదర్శించిన సిద్ధూ తాజాగా తన నిర్ణయం మార్చుకున్నట్టు అనిపిస్తుంది.
ఏదో నెలకు ఇంత జీతం ఇచ్చి చేతులు దులుపేసుకున్నాం అని కాకుండా వారికి కావాల్సిన నిత్యావసరాలను కూడా అందించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు సిద్ధార్థ్. తన ఆఫీస్ లో, ఇంట్లో పనిచేసే వారందరు ఒకచోట ఉండేలా ఒక అపార్ట్ మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. అయితే వారు తన దగ్గర పనిచేస్తున్ననత కాలం తను ఏర్పరచే నివాసంలో ఉచితంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాడట.
ప్రస్తుతం తన నిర్మాణంలో జిల్..జంగ్.. జక్ సినిమా చేస్తున్న సిద్ధూ ఆ సినిమా ప్రచారం కూడా కొత్తగా చేయడం మనకు తెలిసిందే. ఇక అదే కాక అరణ్మయి-2 లో కూడా త్రిషతో జత కడుతున్నాడు సిద్ధార్థ్. నువ్వొస్తానటే నోనొద్దంటానా తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. మరి సిద్ధూ తన దగ్గర పనిచేస్తున్న వారి కోసం చేస్తున్న ఈ మంచి పనిని అందరు మెచ్చుకుంటున్నారు.