నిర్మాతల మండలికి వచ్చే ఆదాయం చెక్/డి.డి ల రూపంలో కాకుండా క్యాష్ గా తీసుకుంటున్న వాటిని బ్యాంక్ లో జమచేయకుండా రెండు సంవత్సరాలుగా నొక్కేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం మూడురోజుల క్రితం బయటకు పొక్కింది.
Bye-Law ప్రకారం ఎట్టిపరిస్థితుల్లోను ఆగస్ట్31, 2015కి నిర్వహించాల్సిన ANNUAL GENERAL BODY Meeting 3నెలలు గడచినా కూడా ఇంతవరకు ఏర్పాటు చెయ్యకుండా, Annual Report పంపకుండా, కనీసం ప్రతినెలా జరగాల్సిన E.C meeting కూడా ఏర్పాటు చెయ్యకుండా, జరిగిన మోసం గురించి Producers council members ఎవ్వరికీ తెలియనివ్వకుండా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా TFPC office Bearers కాలయాపన చెయ్యటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
Court సాకుతో గత మూడు సంవత్సరాలుగా ‘ఎలక్షన్స్’ నిర్వహించకుండా పదవుల్లో ఉంటూ, ఆర్ధిక అవకతవకలు జరుగుతున్నందున కార్యవర్గం పదవుల నుండి వైదొలగి వెంటనే Elections జరిపించమని demand చేస్తున్నాం.
Elections జరిపించమని అడిగినప్పుడు,council లో జరుగుతున్నఅవకతవకలు గురించి ప్రశ్నించినప్పుడు, మీ నుండి ‘మా ఇష్టం’ అనే ధోరణిలో కనీస మర్యాదలేని సమాధానం లభిస్తున్నందున, ఇప్పుడు జరిగిన ఫ్రాడ్ గురించి మీకు వ్రాసినా ఎటువంటి జవాబు రాదని తెలిసి గత్యంతరం లేక, ఈ మోసం బహిరంగ పరుస్తున్నాం. వెంటనే TFPC Chartered Accountant తో కల్సి Press Meet ఏర్పాటు చేసి జరిగిన మోసం గురించి తెలియచేయటమే కాకుండా, మండలికి బ్యాంక్ లలో deposits ఉన్న 13కోట్లలో కొంత ‘డ్రా’ చేసి అధిక వడ్డీకి బయట తిప్పుకుంటున్నట్లు ఆరోపణలు కూడా వస్తున్నందున, గత రెండు సంవత్సరాల Banks Statements copies మీడియా ముందు ఉంచి,copies ని మెంబర్స్ కి పంపటం లేదా TFPC Websiteలో ఉంచటం ద్వారా వాస్తవ పరిస్థితిని తెలియచేయవల్సిన అవసరం మీ ముందు ఎంతైనా ఉంది.
కోట్ల రూపాయల పెట్టి ఏదైనా property కొనాలనుకొన్నప్పుడు Special General Body పెట్టి మెంబర్స్ అందరికి తెలియపర్చి అనుమతి పొందకుండా, ఏకపక్షంగా E.C అనుమతి ఉంది అని చెప్పి ఆదరాబాదరాగా మూవీ టవర్స్ లో ఎందుకూ ఉపయోగపడని Flats కొన్నారు. Hyderabad శివార్లలో భూమి కొని ‘మూవీ టవర్స్-2’ కట్తిస్తామని ‘Housing Society’ meeting లో చేసిన వాగ్ధానాలు మర్చిపోయారు. అలాగే కమీషన్స్ కి కక్కుర్తిపడి 50లక్షలు వెచ్చించి Tirupati లో ఒక Property కొన్నారు. 1000మంది మెంబర్స్ welfare కోసం ఉపయోగపడాల్సిన డబ్బు ఇలా దుర్వినియోగం అవ్వటo బాధాకరం.