ప్రకృతి వైపరీత్యాలు ఎంతటి వినాశనానికి దారి తీస్తాయో ప్రస్తుతం చెన్నై మహానగరం లో ప్రత్యక్షం గా కనపడుతోంది. జనజీవనం స్తంభించిపోయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న చెన్నై నగర వాసులకు అండగా నిలవటం అవసరం.
చెన్నై నుండి వస్తోన్న చిత్రాలను చూసి చలించిపోయిన నందమూరి సోదరులు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తమ వంతు సహాయం గా తమిళనాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి సహాయాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ 10 లక్షల రూపాయలను, కళ్యాణ్ రామ్ 5 లక్షల రూపాయలను ప్రకటించారు.
” చెన్నైతో మాకు ఉన్న అనుబంధం మరువలేనిది. అటువంటి మహానగరం నుండి నేడు వస్తోన్న చిత్రాలను చూస్తోంటే చాలా బాధ గా ఉంది. ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది. సహాయం అందించగలిగిన ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయం ఇది. మా తరపున ఆర్ధిక సహాయాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాం. చెన్నై త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం”, అని ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తెలిపారు.
తమిళనాడు వరద భాదితులకు 5 లక్షల విరాళం ప్రకటించిన మాస్‌మహరాజ్ రవితేజ, ఇటీవల కాలంలో తమిళనాడు మెత్తం విస్త్రుతమైన వర్షాల కారణం గా రాష్ట్రమంతా ప్రజల తీవ్రమైన ఇబ్బందులకు గురైన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన మాస్‌మహరాజ్ రవితేజ 5 లక్షల విరాళం ప్రకటించారు. త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి సి.యమ్ రిలీఫ్ ఫండ్ కి అందించనున్నారు.
చెన్నై వరదల కి రూ.1.00.000/- విరాళం ప్రకటించిన నిర్మాత ప్రతాప్ కోలగట్ల, ఎల్లప్పుడూ తన వంతు ఏదో సహాయం చేస్తూ కొందరికి బరోసా కల్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు నిర్మాత ప్రతాప్ కోలగట్ల(3జి లవ్). ఇక గతం లో వైజాగ్ హూద్ హూద్ తుఫాన్ భాధితుల సహాయార్ధం 1లక్ష విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి అందించారు ప్రతాప్. ఇక సూర్య, విశాల్ వంటి తమిళ నటులు మన వైజాగ్ హుడ్ హుడ్ తుఫాన్ కి స్పందించి లక్షల రూపాయిల విరాళం అందించారు. ఇప్పుడు అలాంటి విప్పత్తే చెన్నై ని తాకింది. ఈ సమయం లో మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి స్పందించి సాయం అందించాల్సిన సమయం వచ్చింది. నా వంతుగా రూ.1.00,000 అందిస్తున్నాను. అని నిర్మాత ప్రతాప్ కోలగట్ల ప్రకటించారు.. అతి త్వరలో ముఖ్య మంత్రి జయలలిత గారికి కలిసి ఈ సాయాన్ని అందిస్తాను అని తెలిపారు. తన బాటలోనే మన తెలుగు చిత్ర పరిశ్రమ కు సంబంధించిన మరి కొందరు ముందుకు వచ్చి సహాయం అందించాలని తన ఆశా భావాన్ని వ్యక్త పరిచారు.
చెన్నై వరద బాధితులకు 3 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన వరుణ్ తేజ్ , ప్రస్తుతం చెన్నై నగరం లో ఉన్న పరిస్థితులకు స్పందిస్తూ, యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నట్లు గా అయన తెలిపారు.
“చెన్నై నేను పుట్టిన నగరం. అటువంటి చెన్నై నేడు ఇలా వరద నీట మునగటం నన్ను ఎంతగానో కలచివేసింది. నా వంతు సహాయం గా నేను 3 లక్షల రూపాయలను CM రిలీఫ్ ఫండ్ కి పంపిస్తున్నాను. అందరూ తమకు తోచినంత సహాయం చేయవలసింది గా కోరుతున్నాను”, అని అన్నారు.