నీకు నాకు.. సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సుందరి నందిత. అయితే ఆ సినిమాలో మంచి నటన కనబరచినా ఆశించినంతగా గుర్తింపు రాలేదు కాని ప్రేమ కథా చిత్రం సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మధ్య అమ్మడు చేసిన ఏ సినిమా విజయం సాధించక పోగా సినిమాల్లో నందిత పాత్ర కూడా అంత గుర్తింపు లేకుండా ఉండటం విశేషం.
మరి సినిమాల ఎంపిక విషయంలో నిర్ణయం సరిగా తీసుకోవట్లేదా లేక వచ్చే అవకాశాలే అలా వస్తున్నాయా తెలియదు కాని. చూస్తుంటే అమ్మడు పని అయిపోనట్టే అనిపిస్తుంది. నిన్న విడుదల అయిన శంకరాభరణం సినిమాలో చెప్పడానికి హీరోయిన్ నందిత అన్నా సరే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది అన్నది వాస్తవం. కాస్త కూస్తో చిన్న పాత్ర చేసినా అంజలి తన ముద్ర సినిమాలో ఉండేలా చేసుకుంది కాని నందిత మాత్రం అసలు ఆకట్టుకోలేదు.
ఓ పక్క హీరోయినలు అదిరిపోయే విధంగా విజృంభించి నటిస్తుంటే ఏదో పేలవమైన నటన కనబరచి ఉన్న మంచి పేరుని కూడా పొగొట్టుకుంటుంది నందిత. మరి అమ్మడి ఇకనుండైనా కాస్త జాగ్రత్త పడి పాత్ర ప్రాధాన్య ఉన్న సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు.