హైదరాబాద్: 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేమ్ పృథ్వీకి రోజు రోజుకూ క్రేజ్ పెరిగిపోతోంది. మొన్న శుక్రవారం విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రం ఎలా ఉంది అని అడిగితే పృథ్వీకోసం ఒకసారి చూడొచ్చు అంటున్నారంటే అతడు ఎంత సక్సెస్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మొన్న శుక్రవారంనాడే విడుదలైన సౌఖ్యం చిత్రం ట్రైలర్లోనూ పృథ్వీయే బాగా హైలైట్ అయ్యాడు. దానిలి బాహుబలి గెటప్‌లో పృథ్వీ శివలింగం మోసే సీన్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఈ గెటప్ ఫోటోలు సోషల్ మీడియాలోనూ బాగా రౌండ్స్ కొడుతున్నాయి. ఒకే రోజు రెండు సినిమాల ద్వారా పృథ్వీ హాట్ టాపిక్ అయ్యాడు. అందుకే పృథ్వీకి క్రేజ్ పెరిగిపోతోంది.
మొన్నటివరకు బ్రహ్మీ తమ సినిమాలో ఖచ్చితంగా ఉండాలనుకున్న పెద్ద సినిమాల దర్శక నిర్మాతలు ఇప్పుడు పృథ్వీపై ఫోకస్ పెట్టారు. బ్రహ్మీ పాత్రలుకూడా పృథ్వీ ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయంటున్నారు. దానికితోడు ఈ ఏడాది విడుదలై విజయవంతమైన బాహుబలి, శ్రీమంతుడు వంటి పలుచిత్రాలలో బ్రహ్మీ లేకపోవటం, ఆయన పూర్తిస్థాయి పాత్రలు పోషించిన బ్రూస్ లీ, కిక్ 2 ఫ్లాప్ అవటంతో బ్రహ్మీకి క్రేజ్ తగ్గింది. కోన వెంకట్ కూడా పృథ్వీని ప్రోత్సహిస్తున్నట్లు కనబడుతోంది. గత ఏడాది ‘లౌక్యం’ సినిమాలో పృథ్వీ పోషించిన బాయిలింగ్ స్టార్ బబ్లూ రోల్ బాగా క్లిక్ అయింది. తాజాగా శంకరాభరణంలోకూడా బ్రహ్మీ స్థానంలో పృథ్వీని తీసుకున్నారు. పర్సంటేజ్ పరమేష్‌గా పృథ్వీ పాత్ర బాగా క్లిక్ అయింది. రేపు సౌఖ్యంలో క్యారెక్టర్ కూడా క్లిక్ అయితే ఇక అతనిని ఆపటం కష్టం. ఏది ఏమైనా బ్రహ్మీకి మళ్ళీ మంచి రోల్ పడేలోపు పృథ్వీ స్ట్రాంగ్ అయిపోయేటట్లున్నాడు.