కోనా వెంకట్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన సినిమా శంకరాభరణం. సినిమా మొదలైన రోజు నుండు ఎన్నో భారీ అంచనాలు ఏర్పడేలా చేసుకున్న సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ సూపర్ హిట్ క్లాసిక్ శంకరాభరణం అనే టైటిల్ పెట్టేసరికి సినిమాలో మంచి విషయం ఉంటుందని భావించారు. తీరా సినిమా చూస్తే కాని అర్ధం కాలేదు కోనా వెంకట్ శంకరాభరణం ని కూని చేశాడని.
ప్రస్తుతం తెలుగు సినిమా వ్యాపారం ఓవర్సీస్ వసూళ్ల పరంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాస్త కొత్తగా మంచి ఆహ్లాదకరంగా ఉండే ఏ సినిమానైనా సరే అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టేస్తున్నారు. కోనా వెంకట్ ‘ఫన్ గయారే ఒబామా’ బాలీవుడ్ సినిమాను తెలుగులో మార్చి తీశాడు. ఓవర్సీస్ లో సినిమా విడుదల ముందు దాదాపు 80 లక్షల దాకా వ్యాపారం జరిగినా వాటిని కలక్షన్స్ రప్పించడంలో మాత్రం విఫలమయ్యారు.
సినిమా మొదటి షో నుండి ఫ్లాప్ టాక్ వచ్చేసరికి సినిమా ఓవర్సీస్ లో కూడా అంతగా కలక్షన్స్ రాబట్టలేకపోతుంది. ట్రేడ్ లెక్కల ప్రకారం శంకరాభరణం సినిమా ఓవర్సీస్ లో భారీ అపయజాన్ని మూటకట్టుకున్నది. సినిమా చిన్నదైనా, పెద్ద దైనా బాగుంది అంటే చాలు ఓవర్సీస్ కలక్షన్స్ కుమ్మేస్తాయి. ఒకవేళ సినిమా అటు ఇటు అయితే అక్కడ కోల్పోయేది కూడా అదే విధంగా ఉంటుంది. రవితేజ – కిక్ 2, విష్ణు – డైనమైట్, అఖిల్ – అఖిల్, రామ్ చరణ్ – బ్రూస్ లీ సరసన ఇప్పుడు నిఖిల్ శంకరాభరణం కూడా చేరింది.. ఓవర్సీస్ మార్కే మీద కన్నేసిన తెలుగు దర్శక నిర్మాతలకు అక్కడ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే బెటర్ లేదంటే పైన సినిమాలకు వచ్చిన ఫలితమే అన్ని సినిమాలకు వచ్చే అవకాశం ఉంది.