వరదలతో ముంచెత్తిన చెన్నై ప్రాంతాన్ని కాపాడేందుకు నడుంబిగించారు తెలుగు సినిమా పరిశ్రమలోని కుర్ర హీరోలు. ఏదో డబ్బులు ఇచ్చాడం చేతులు దులుపుకున్నాం అని కాకుండా అక్కడ నిత్యావసరాలకు సంబంధించిన వాటిని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో మెసేజ్ లు పొందుపరుస్తున్నారు. చిన్న క్యాండిల్ దగ్గర నుండి వాటర్ బాటిల్ వరకు మీకు తోచిన సాయం చేయండని కోరుతున్నారు మన మద్రాసు కోసం కి నడుంకట్టిన తెలుగు హీరోలు.
త్రిలోక్ అనే కుర్రాడు ఫేస్ బుక్ లో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని యువర్ హీరోలు రానా, నవదీప్, నానిలు తన మీద వేసుకుని చేస్తున్నారు.. ఈ కార్యక్రమంలో భాగంగానే కూకట్ పల్లి సుజనా మాల్ లో జనాల నుండి విరాళాలను సేకరించే పనిలో కాస్త అపశృతి దొర్లింది. జనాల ఎక్కువ అవ్వడం చేత అక్కడ కార్యక్రమం జరగకుండానే హీరోలు అక్కడ నుండి బయటకు రావాల్సి వచ్చింది.
అయితే మన మద్రాస్ కోసం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని తమకు తోచిన వాటిని విరాళాలుగా ఇవ్వాలని జనాలను చైతన్య పరుస్తున్నారు హీరోలు. విరాళాలను ఇవ్వదలచిన వారు ఫిల్మ్ నగర్లో రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ఆఫీస్ లో అందివ్వాలని కోరారు.