పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘లోఫర్’.. హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుపుకున్న ఈ సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చాడు. పూరి జగన్నాథ్ తాసిన డైలాగులతో సాగిన ఈ కార్యక్రమం అభిమానుల కోలాహలంతో ఎంతో ఉత్సాహంగా జరిగింది. అయితే ముఖ్య అతిధిగా వచ్చిన ప్రభాస్ మాట్లాడుతూ.. లోఫర్ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని అన్నాడు. తన సినిమాల్లో ఇష్టమైన సినిమా బుజ్జిగాడు అని.. పూరి అంటే తనకు ప్రత్యేక అభిమానం అన్నారు. లోఫర్ సినిమా వరుణ్ కి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకున్నాడు ప్రభాస్. మధ్యలో మెగా ఫ్యాన్స్ అల్లరి చేస్తుంటే ఐ లైక్ పవన్ కళ్యాన్.. ఇప్పుడు మాట్లాడొచ్చా అని అన్నాడు ప్రభాస్.
ప్రభాస్ మాట్లాడిన తర్వాత మైక్ అందుకున్న పూరి తన మార్క్ మాటలతో ప్రేక్షకులని అలరించాడు. తను రాసిన పండగ చేస్కో డైలాగ్ అంటే తనకు చాలా ఇష్టమని అది ఇప్పుడు అందరు వాడుకలో ఉందని అభిప్రాయపడ్డాడు. వరుణ్ మంచి నటుడవుతాడని సినిమాలో తను చాలా బాగా చేశాడని అన్నాడు. ఇక ప్రభాస్ తన డార్లింగ్ అని.. తను తీసిన బుజ్జిగాడులో టిప్పర్ వచ్చి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా అన్నట్టు ఇప్పుడు ప్రభాస్ టిప్పర్ లారీలా ఉన్నాడని అన్నాడు.
పూరి మాటల్లోని అర్ధం ఏంటంటే.. ప్రభాస్ బాహుబలితో పెద్ద టిప్పర్ లాంటి సినిమా తీసి మా లాంటి వారందరిని గుద్దేశాడని అన్నాడు పూరి జగన్నాథ్. అంతేకాదు ప్రభాస్ కౌగింత తనకు చాలా ఇష్టమని హీరోయిన్స్ ని కౌగిలించుకున్నా ఆ ఫీల్ రాదని అందుకే నేను ప్రభాస్ ని ప్రేమిస్తుంటా.. ఐ లవ్ యూ ప్రభాస్ డార్లింగ్ అని ప్రసంగాన్ని ముగించాడు.