‘రచ్చ’ సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్న యువ దర్శకుడు సంపత్ నంది. మొదటి సినిమా ‘ఏమైంది ఈవేళ’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినా.. రచ్చ సినిమాతో దర్శకుడిగా విజయం అందుకున్నాడు. దాని తర్వాత సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాని వదులుకున్నా ఇంకా మెగా హీరోలతో తనకు సత్సంబంధాలున్నాయని చెబుతున్నాడు సంపత్ నంది. సర్ధార్ నుండి బయటకు వచ్చి రవితేజతో ‘బెంగాల్ టైగర్’ తీసిన ఈ దర్శకుడు సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు.
‘బెంగాల్ టైగర్’ ప్రమోషన్ లో పాల్గొన్న సంపత్ నంది ఛాన్స్ వస్తే మళ్లీ పవర్ స్టార్ తో సినిమాకు సిద్ధం అంటున్నాడు. అయితే తనకు ‘రచ్చ’ లాంటి హిట్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ చరణ్ కోసం కూడా ఓ కథ సిద్ధం చేసుకున్నాడట ఈ దర్శకుడు. ‘చోటామేస్త్రి’ అనే టైటిల్ కూడా ఫిల్మ్ చాంబర్ లో నమోదు చేశాడట సంపత్ నంది. ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమాతో బిజీగా ఉన్న సంపత్ త్వరలోనే చరణ్ ని కలిసి కథ చెప్తాడట.
రచ్చ సినిమాతో ఎలాగు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి.. కథ బాగుంటే సంపత్ కి చెర్రి పచ్చ జెండా ఊపేసినట్టే. అయితే ఇందులో మరో చిక్కేంటంటే ప్రస్తుతం తీసిన రవితేజ బెంగాల్ టైగర్ సినిమా ఫలితాన్ని బట్టే చెర్రి కూడా సంపత్ సినిమా చేసేది లేనిది తెలుస్తుంది. చరణ్ సరే అంటే ఇద్దరు కలిసి చోటామేస్త్రిగా రచ్చ చేయడం మొదలైనట్టే..!