హైదరాబాద్: బీఫ్ ఫెస్టివల్‌పై ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని దళిత విద్యార్థులు, పోర్క్ ఫెస్టివల్ నిర్వహిస్తామని హిందూ సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ఓయూలో టెన్షన్ ఏర్పడింది. పోలీసులు పెద్ద సంఖ్యలో యూనివర్సిటీవద్ద మోహరించి, రెండువైపులా గేట్లను దిగ్బంధం చేశారు. యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించరాదని హైకోర్ట్ ఆదేశాలిచ్చినప్పటికీ వామపక్షాలు, దళిత సంఘాల విద్యార్థులు మాత్రం దానిని నిర్వహించారు. పదిమంది విద్యార్థులు ఉస్మానియా హాస్టల్స్‌లో బీఫ్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలను వండుకుని తిని, ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాముని ప్రకటించారు. వీరిని స్టాలిన్, డేవిడ్, శంకర్ తదితరులుగా గుర్తించారు. వారిపైన చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీ ఉన్నతాధికారులు చెప్పారు. పోలీసులు వారిని అరెస్ట్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకుంటామంటూ గోసంరక్షణ సమితి, భజరంగదళ్ సంస్థల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌సీసీ గేట్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. ఓయూకు ఉన్న గేట్లన్నీ మూసేసి, లోపలకు ఎవరినీ అనుమతించటంలేదు. ఇదిలా ఉంటే ఘోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రాజాసింగ్‌ను పోలీసులు ఈ ఉదయమే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ గేటుముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
బీఫ్ ఫెస్టివల్