వర్షం బీభత్సంతో నానా తిప్పలు పడుతున్న చెన్నై ప్రజలకు అన్ని వర్గాల నుండి సహాయం అందుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు సినిమాకు చెందిన యువ హీరోలంతా ‘మన మద్రాస్ కోసం’ అనే ఒక ప్రోగ్రాం ని కండక్ట్ చేస్తున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరోలైన ధనుష్ లాంటి వారు కూడా చెన్నై ప్రజలకు సహాయ సహకారాలను అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి దారిలోనే దర్శకుడు మణిరత్నం భార్య హీరోయిన్ సుహాసిని ఆకలితో అలమటించిపోతున్న చెన్నై ప్రజల కోసం అన్నపూర్ణగా అవతరించింది.
దాదాపు 40 వేల జనాలకు సరిపోయే విధంగా భోజన సదుపాయాలను దగ్గరుండి ఏర్పాట్లు చేసిందట సుహాసిని. బాధితుల కోసం పాలు, బ్రెడ్, వాటర్ బాటిల్ ఇలా ఎవరికి తోచినది వారు ఇస్తున్నారు. అయితే చాలా చోట్ల జనాలు భోజన సదుపాయాలు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టం చూసి చలించిన సుహాసిని బాధితుల కోసం భోజనాన్ని ఏర్పాటు చేసి పంపించిందట.
డబ్బు సహయాం చేసిన వారి కన్నా ఇలా ఆకలితో అలమటిస్తున్న వారి అన్నం పెట్టి చెన్నై వరద బాధితులకు అన్నపూర్ణగా అవతరించింది హీరోయిన్ సుహాసిని. వరద నీరు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయని తెలుస్తుంది. ఇంకా చాలా చోట్లా నిత్యావసరాలకు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది వార్తలు వస్తున్నాయి.