హైదరాబాద్: విజయవాడలో సంచలనం సృష్టించిన కల్తీమద్యం దుర్ఘటన కేసు ఇవాళ సంచలన మలుపు తిరిగింది. స్వర్ణ బార్లోనే మద్యం కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయింది. యజమాని, మల్లాది విష్ణు సోదరుడు శ్రీనివాస్ నేరం అంగీకరించారని చెబుతున్నారు. శ్రీనివాస్‌ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. క్యాషియర్ వెంకటేశ్వరరావు మద్యంలో మత్తుకోసం స్పిరిట్ కలిపినట్లు శ్రీనివాస్ విచారణలో పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాషియర్ వెంకటేశ్వరరావును పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇవాళ బయటకొచ్చింది. డిపోలనుంచి బార్‌కు వచ్చిన 9 బ్రాండ్లలో కల్తీ లేదని, బార్లోనే కల్తీ జరిగిందని తేల్చారు. మద్యంలో ఒకరకమైన రసాయనం కలిసిందని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. కల్తీమద్యం ఘటనలో ఐదుగురు చనిపోయాగా, ఒకరికి బ్రెయిన్ డెడ్ అయింది. మరోవైపు ఈ కేసులో తొమ్మిదవ నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు కటక్ వెళ్ళినట్లు చెబుతున్నారు.