‘ఉయ్యాల జంపాల’ సినిమాతో షార్ట్ ఫిల్మ్స్ నుండి హీరోగా తెరంగేట్రం చేశాడు రాజ్ తరుణ్. ఆ సినిమా హిట్ తో వెంటనే సినిమా తీయకుండా దాదాపు సంవత్సరం పాటు ఆగిన రాజ్, ఇప్పుడు వరుసెంట సినిమాలను విడుదల చేస్తూ సూపర్ హిట్ కొడుతున్నాడు. మొన్నీమధ్య వచ్చిన ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21ఎఫ్’ రెండు మంచి హిట్ అయ్యే సరికి కుర్రాడి డిమాండ్ కూడా బాగా పెరిగి పోయింది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని చేతిలో ఉన్న యువ హీరో తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా తీశాడు.
ఉయ్యాల జంపాల సినిమాలో సహాయక దర్శకుడిగా పనిచేసిన తన స్నేహితుడు శ్రీనివాస్ గవిరెడ్డి చెప్పిన కథ నచ్చి తప్పకుండా సినిమా చేద్దామని మాట ఇచ్చాడట. అయితే ప్రస్తుతం రెండు సూపర్ హిట్ సినిమాలతో మంచి ఊపుమీదున్నాడు రాజ్ ఈ సమయంలో సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. కాని రాజ్ మాత్రం స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం తన దర్శకత్వంలో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాలో నటించాడు.
ఏదో రెండు హిట్ సినిమాలు పడగానే అప్పుడే స్నేహం కోసం గొప్ప నిర్ణయాలు తీసుకునే రాజ్ కి సినిమా విషయంలో ఏమన్నా తేడా కొడితే ఊహించని పరిస్థితులు ఎదురవుతాయని తెలియదు కాబోలు. ప్రస్తుతం రాజ్ మంచు విష్ణు తో ఓ సినిమా చేస్తుండగా.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూకీ సినిమాలో కూడా నటిస్తున్నాడు. మరి స్నేహం కోసం తీసిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా కూడా హిట్ అయ్యి తన నిర్ణయం సరైనదనే అని రాజ్ అందరికి చెప్తాడా లేదా అన్నది చూడాలి.