ఏ అభిమానం అయితే అభిమాన నటుడికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా చేస్తుందో అదే అభిమానం శృతిమించితే ఒక్కోసారి అపవాదాలు మూటకట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు సరిగ్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంగతి అలానే ఉంది. వేడుక ఏదైనా మెగా ఈవెంట్ అంటే చాలు పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్ అందరు రచ్చ చేస్తుంటారు. మాట్లాడేది స్టార్ హీరోనా, సంచలన దర్శకుడా ఎవరని చూడరు.. వారు మాట్ల్డేది వినుపించుకోరు కేవలం పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ కేకలు వేస్తారు.
మెగా ఈవెంట్ అయితే ఓకే కాని ఇటీవల జరిగిన లోఫర్ ఆడియో వేడుకలో వరుణ్ ఇష్టమైన హీరో అంటున్నాడు కదా అని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని అతిథిగా ఆహ్వానించారు. వేదిక అతిథి మాట్లాడుతున్నప్పుడు నిశబ్ధంగా ఉండాలన్న నిబంధనలు తెలియని పవర్ స్టార్ అభిమానులు ప్రభాస్ ‘ఐ లైక్ పవన్ కళ్యాణ్’ అనే దాకా విడిచి పెట్టలేదు. ఆడియో వేడుక అయ్యింది వ్యవహారం అంతటితో అయిపోయింది అనుకుంటే డేరింగ్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ అభిమానుల మీద విరుచుకు పడ్డాడు.
ఇలాంటి అభిమానుల వల్లే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెడ్డ పేరు వస్తుందని.. ఏ హీరో అయినా సరే సభ్యతతో కూడిన అభిమానాన్ని కోరుకుంటాడని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ విషయం గురించి సందేశం ఇవ్వాలని. ఆయన చెబితేనే వారు వింటారని అన్నాడు పూరి జగన్నాథ్. మొన్నటిదాకా తన గురువు వర్మ పవన్ కళ్యాణ్ అభిమానులను టార్గెట్ చేసి విమర్శల పాలయిన సంగతి తెలిసిందే. మరి పూరి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులను తప్పు పట్టాడు మరి ఈ దర్శకుడికి పవర్ స్టార్ అభిమానులు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.