డిక్టేటర్ థమన్ ఒక్కడే సంగీతం అందిస్తున్నాడు కాని నేపథ్య సంగీతానికి మణిశర్మ సహాయం తీసుకుంటున్నారంట చిత్ర యూనిట్. నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా కాబట్టి సినిమాను ఎలాగైనా ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నాడు చిత్ర దర్శకుడు శ్రీవాస్. అందుకే నేపథ్య సంగీతం మణిశర్మ అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడట.. అయితే బాలయ్య కూడా ఓకే చెప్పడం తో డిక్టేటర్ లో మణిశర్మ కూడా పాలుపంచుకుంటున్నాడు.
అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అక్ష ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. శ్ర్ద్ధద్దా దాస్ ఐటం సాంగ్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా నేపథ్య సంగీతం మణిశర్మ అందిస్తున్నాడు. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
బాలయ్య నటించిన చాలా సినిమాలకు మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించి సినిమాలను హిట్ బాట పట్టించాడు. మణిశర్మ నేపథ్యం సంగీతం అంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది. మరి డిక్టేటర్ సినిమాకు పనిచేస్తున్న మణిశర్మ ఎలాంటి నేపథ్య సంగీతం ఇస్తాడో చూడాలి. సంక్రాంతి బరిలో దిగుతున్న డిక్టేటర్ కి పోటీగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు వస్తున్నాయి.