హైదరాబాద్: అవును ఈ మాటలు సాక్షాత్తూ సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ చెప్పారు. మరి ఈ మొత్తాన్ని సాక్షులను కొనటానికా, న్యాయాన్ని కొనటానికా అనేది మాత్రం చెప్పలేదు. సల్మాన్ నిర్దోషిగా కోర్ట్ తీర్పు ఇవ్వటంపై రేగుతున్న విమర్శలపై సలీమ్ ఖాన్ మండిపడ్డారు. దర్యాప్తు సరిగా జరగలేదని విమర్శలు చేస్తున్నవారు, గతంలో సెషన్స్ కోర్ట్ సల్మాన్‌కు శిక్ష విధించినపుడు ఆ మాట చెప్పలేదేమని ప్రశ్నించారు. సల్మాన్ చాలా సులభంగా బయటపడిపోయాడని అందరూ అనుకుంటున్నారని, అది నిజం కాదని అన్నారు. అతను కొద్దిరోజులు జైలులో ఉన్నాడని, ఈ కేసుకోసం రు.20-25 కోట్లకు పైగా ఖర్చుచేశాడని చెప్పారు. ఇదంతా ఒక ఎత్తయితే, ఈ 13 సంవత్సరాలు అతను, అతనికి సంబంధించిన తామంతా ఎంతో టెన్షన్ అనుభవించామని అన్నారు. అది కూడా ఒకరకంగా శిక్షేనని వ్యాఖ్యానించారు. తమకు న్యాయవ్యవస్థలో నమ్మకం ఉందని అన్నారు. సల్మాన్ పెళ్ళి చేసుకోకపోవటానికి ఈ కేసుకూడా ఒక కారణమని తెలిపారు. ఇప్పుడు సల్మాన్‌కు దగ్గరవాళ్ళమందరం హ్యాపీగా ఉన్నామని చెప్పారు. తనకు సంతోషం, ఊరట కలిగాయని సలీమ్ అన్నారు.