‘రన్ రాజా రన్; , ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ ఎనర్జిటిక్ శర్వానంద్ హీరోగా, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి తొలి చిత్రంతోనే బంపర్ హట్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో, సురభి కథనాయికగా, మిర్చి, రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో క్లీన్ స్మాషింగ్ హిట్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ , ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా. ఇటీవలే రిలీజ్ చేసిన చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సక్సెస్ ఫుల్ టీం నుంచి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులతో పాటు. చిత్ర పరిశ్రమలో ఎక్స్ ప్రెస్ రాజా చిత్రానికి ఊహించని విధంగా స్పందన లభించింది. ఇదే ఊపును కంటిన్యూ చేస్తూ. ఈరోజు ఎక్స్ ప్రెస్ రాజా చిత్రంలోని ఒక సాంగ్‌ని విడుదల చేశారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన అద్భుతమైన పాటలను ఈనెల 19న అభిమానులు, సినీ పెద్దల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..మా బ్యానర్ లో రన్ రాజా రన్ చిత్రంతో శర్వానంద్ మా కాంబినేషన్ సూపర్‌హిట్ అయిన విషయం తెలిసిందే. మళ్ళి మా కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ నుండి టీజర్ వరకూ హ్యూజ్ రెస్పాన్స్ రావటం చాలా ఆనందంగా వుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంతో సూపర్‌డూపర్ సక్సస్ ని అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధి ఈచిత్రానికి దర్శకుడు. సురభి కథానాయిక. అలానే ఈరోజు మా చిత్రంలోని ఆడియో లో ఓ సాంగ్ ని విడుదల చేశాము. అలాగే డిసెంబర్ 19 న అభిమానుల సమక్షంలో ఈచిత్రం యెక్క ఆడియోని విడుదల చేస్తున్నాము. చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నాము. మా బ్యానర్ నుండి ఎలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారో ఆరేంజి లో మా ఎక్స్‌ప్రెస్ రాజా వుంటుంది. అని అన్నారు.
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – మేర్లపాక గాంధి
శర్వానంద్, సురభి, ఊర్వ హరీష్ ఉత్తమన్, పోసాని కృష్ణ మురళి సూర్య నాగినీడు బ్రహ్మాజి, సుప్రీత్, సప్తగిరి, ప్రభాస్ ను, షకలకశంకర్, ధనరాజ్ తదితరులు నటించగా..
ఈ చిత్రానికి
మ్యూజిక్ – ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫి – కార్తిక్ గట్టమనేని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సందీప్. ఎన్
ఎడిటర్ – సత్య.జి
ప్రొడక్షన్ డిజైనర్ – ఎస్.రవిందర్
లిరిక్స్ – భాస్కరభట్ల, శ్రీమణి, శ్రీ జో
డ్యాన్స్ – రాజు సుందరం, విశ్వ, రఘు
చీఫ్ కాస్ట్యూమ్ డిజైనర్ – తోట విజయ్ భాస్కర్
ఫైట్స్ – స్టంట్ జాషువా
ప్రొడక్షన్ కంట్రోలర్స్ – ఎమ్. కృష్ణం రాజు (గోపి), మత్తపాటి షణ్ముఖ రావ్
పి.ఆర్.ఓ – ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ – వర్కింగ్ టైటిల్ (శివ కిరణ్)