హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనూరాధ హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూ తన నేరాన్ని అంగీకరించాడు. చిత్తూరు జిల్లా ఎస్‌పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఇవాళ ఆ కేసు తాజా వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆరునెలల నుంచే కఠారి అనూరాధ, ఆమె భర్త చింటూలను హత్యచేయటానికి చింటూ కుట్ర పన్నినట్లు తెలిపారు. రెండుసార్లు రెక్కీ కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. మూడోసారి అతను విజయవంతమయ్యాడని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు 23 మందికి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించామని, 20 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. మిగతా ముగ్గురిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ కేసులో 7 రివాల్వర్లు, 13 కత్తులు, 31 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ కొనసాగుతోందని చెప్పారు. మరోవైపు, తనను క్రిమినల్‌గా చూపించి తనకు పెళ్ళి కాకుండా చేశారని, అందుకే వారిని హతమార్చానని చింటూ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.