మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మించిన “బెంగాల్ టైగర్” గత గురువారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు ఈ చిత్రాన్ని కొనుక్కొన్న డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతూ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.
కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే 14 కోట్ల 80 లక్షల రూపాయల వసూల్లు సాధించి.. సోమవారం కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో “బెంగాల్ టైగర్” చిత్రం డిస్ట్రిబ్యూటర్ల పాలిట కల్పతరువుగా మారింది. సోమవారంనాటికే బ్రేక్ ఈవెన్ రెవెన్యూస్ సాధించడం ఇందుకు కారణం. ముఖ్యంగా నైజాంలో 4 రోజుల్లో 6 కోట్ల రూపాయల వసూళ్ళు సొంతం చేసుకొని “బెంగాల్ టైగర్” చిత్రం రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం విశేషం.
ఈ సందర్భంగా చిత్ర నిర్మార కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. “ఈమధ్య కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలకు రెవెన్యూ పరంగా బ్రేక్ ఈవెన్ రావడం అన్నది జరగలేదు. అటువంటి తరుణంలో మా సంస్థ నుంచి వచ్చిన “బెంగాల్ టైగర్” ఈ రేర్ ఫీట్ ను ఎంతో ఈజీగా దక్కించుకోవడం నిర్మాతగా నాకు గర్వకారణం. ముఖ్యంగా సినిమాలకు “అన్ సీజన్”గా పేర్కొనే డిసెంబర్ నెలలో ఈ విధమైన భారీ కలెక్షన్స్ లభించడం రవితేజకు స్టార్ డమ్ కు నిదర్శనంగా నిలిచింది” అన్నారు!