అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ సంపాధించిన అమ్మడు లావణ్య త్రిపాఠి. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చినా పాత్ర ప్రాధాన్యత ఉంటేనే అంటూ చాలా సినిమాలను కాదన్న కథానాయిక ఈ సంవత్సరం వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాతో తన ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకుంది. కేవలం నటనతోనే ఆకట్టుకునే అమ్మడు ఇప్పుడు కాస్త శృంగారం కూడా ఒలపోసేందుకు తయారవనుందట.
‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న లావణ్య తను పాత్ర ప్రాధన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తానని తెలుగు అవకాశాలే కాదు తమిళ్ నుండి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయని ప్రస్తుతం తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాకే తమిళ సినిమాల వైపు వెళ్తా అంటుంది మన అందాల రాక్షసి. ఇక ఇష్టమైన దర్శకుడు రాజమౌళి అని చెప్పిన లావణ్య బాహుబలి-2 లో తను ఉన్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది.
రాజమౌళి అడగాలే కాని ఆయన సినిమాలో ఏ చిన్న పాత్రైనా చేస్తా అని అంటుంది లావణ్య. ప్రస్తుతం కెరియర్ సాఫిగా సాగుతున్న అమ్మడు ఇంకా మరెన్నో సినిమాలను సక్సెస్ కొట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అవ్వాలని కోరుకుందాం.