ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ సినిమాల మాదిరి వింత పొకడలను అలవాటు చేసుకున్నాయి. సినిమాలో కనీసం ఒక్క అదరచుంభనం లేకుండా సినిమా వదలట్లేదు. అయితే దీనికి తాను ఏమత్రం అంగీకరించను అంటున్నాడు యువ హీరో నిఖిల్. తను చేసిన ఏ సినిమాలో హీరోయిన్ తో లిప్ లాక్ కాదు కదా కనీసం అసభ్యకరంగా కూడా చూపించేందుకు కూడా ఇష్టపడడట ఈ కుర్ర హీరో.
అయితే దీనికంతటికి ఒక కారణం లేకపోలేదు. నిఖిల్ తన అమ్మకిచ్చిన మాట కోసమే చేసే సినిమాలో ఎలాంటి శృంగార భరిత సన్నివేశాలలో నటించనని మాటిచ్చాడట. అదే మాట మీద నిలబడుతూ ఇన్నాళ్లు తన సినిమాలో అలాంటి వాటికి చోటివ్వలేదని అంటున్నాడు నిఖిల్. ఈ మధ్య విడుదలైన శంకరాభరణం కాస్త నిరాశ పరిచినా కోనా వెంకట్ తో పనిచేయడం గొప్ప అనుభూతి అంటూ అతన్ను దువ్వుతున్నాడు.
మొన్నటిదాకా హ్యాట్రిక్ సక్సెస్ లో ఉన్న నిఖిల్ శంకరాభరణం ఆ ట్రాక్ తప్పేలా చేసినా మరోసారి కోనా వెంకట్ తో కలిసి పనిచేసి సూపర్ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు నిఖిల్. మరి కోనా వెంకట్ మీద పెట్టుకున్న నిఖిల్ ఆశలు ఈసారైనా నెరవేరేలా చేసుకుంటాడో లేదో చూద్దాం.