విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో “సితార ఎంటర్ టైన్మెంట్స్” పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న తాజా చిత్రం ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్, ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. మరో ప్రముఖ నిర్మాత మరియు వెంకటేష్ సోదరులు సురేష్ బాబు కెమెరా స్విచ్చాన్ చేసారు. మొదటి షాట్ కు ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ… “వెంకటేష్ గారు హీరోగా మారుతిగారి దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించే అవకాశం లభించదం సంతోషకరం. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన నయనతార నటించనున్నారు. “ఉత్తమ విలన్, చీకటి రాజ్యం” వంటి విభిన్నమైన చిత్రాలకు సంగీతాన్ని సమకుర్సిన జిబ్రాన్ ఈ సినిమాకి స్వర సారధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మూడు అద్భుతమైన బాణీలు సమకూరాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కించనున్నారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రాన్ని 2016 ప్రధమార్ధంలో విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం” అన్నారు.
బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, పృధ్వి, మురళీశర్మ, దేవ్ గిల్, జయప్రకాష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: SB.ఉద్దవ్, కళ: రమణ వంక, చాయాగ్రహణం: వివేక్ ఆనంద్, సంగీతం: జిబ్రాన్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, రచన-దర్శకత్వం: మారుతి!