హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా ముందు వాపోయిన సంగతి తెలిసిందే. గిరిజన సంప్రదాయ ఆయుధాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలను నరుకుతానని తమ గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అంటే దానినేదో పెద్దది చేసి అనేక సెక్షన్ల కింద కేసుపెట్టారని, రాజంపేట ఎంపీ, తమ పార్టీ నేత మిధున్ రెడ్డి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో మేనేజర్‌ను కొట్టినట్లు తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఆ మేనేజర్ అరగంటముందుగానే కౌంటర్ మూసేస్తే, ఫ్లైట్ ఎక్కాల్సిన 19 మంది ప్రయాణీకులు నిలిచిపోయారని, మిధున్ రెడ్డి అడిగినందుకు అతను ఆ మేనేజర్‌ను కొట్టినట్లు కేసు నమోదు చేశారని అన్నారు. నిజంగా మిధున్ రెడ్డి కొట్టి ఉంటే సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. ఆ ఫుటేజ్‌లో తమవాళ్ళు మేనేజర్‌ను కొట్టి ఉంటే మిధున్‌రెడ్డితో రాజీనామా చేయిస్తానని, లేకపోతే చంద్రబాబు రాజీనామా చేయాలని చెప్పారు.
Loafer movie live updates
అసలు ఆ రోజు గొడవ విషయానికొస్తే – మిధున్ రెడ్డికి, ఎయిర్ పోర్ట్ మేనేజర్‌కు గొడవ వచ్చిందని, వెంటనే మిధున్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారని, ఆయన తన మందీ మార్బలంతో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారని వార్తలొచ్చాయి. ఆ రోజు గొడవ జరిగిన తర్వాత, విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న మీడియావారు మిధున్ రెడ్డిని ప్రశ్నించగా, అసలు ఎయిర్‌పోర్ట్‌లో రాజశేఖర్ అనే వ్యక్తే లేరని చెప్పారు. మరికొన్నిరోజుల తర్వాత అడిగితే, రాజశేఖర్ తమతో దురుసుగా ప్రవర్తించాడని, రాజశేఖర్ క్షమాపణ చెప్పాడని కూడా అన్నారు. కేంద్ర విమానయానశాఖ, ఢిల్లీలోని ఎయిర్ ఇండియా వర్గాల ఆదేశాల మేరకు మిధున్ రెడ్డిపై ఏర్పేడు పోలీస్ స్టేషన్లో విమానాశ్రయ సిబ్బంది కేసు నమోదు చేయగా, రాజశేఖర్‌పై వైసీపీ వర్గాలు కూడా కేసు నమోదు చేశాయి.
For all the live updates and Box office information, like us on Facebook. https://www.facebook.com/telugu360
నవంబర్ 26న రేణిగుంట విమానాశ్రయంలో జరిగిన ఆ గొడవ తాలూకు సీసీటీవీ ఫుటేజ్ ఇవాళ బయటకొచ్చింది. జాతీయ న్యూస్ ఛానల్ ఇండియాటుడే టీవీ ఆ ఫుటేజ్‌ను సంపాదించి ప్రసారం చేసింది. దానిలో మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వారి అనుచరులు ఎయిర్పోర్ట్ మేనేజర్ రాజశేఖర్‌పై దాడి చేయటం, పిడిగుద్దులు గుద్దటం స్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత పోలీసులు రాజశేఖర్‌ను వారినుంచి తప్పించి ఆఫీసులోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ దెబ్బల తీవ్రత ఎంత ఉందంటే రాజశేఖర్ హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చేరి ఫ్రాక్చర్ గాయాలకు చికిత్స చేయించుకోవాల్సివచ్చింది. రాజశేఖర్‌ను దీనిపై సంప్రదించగా, ఆయన విపరీతంగా భయపడుతున్నారని, మాట్లాడటానికి నిరాకరించారని ఇండియాటుడే ప్రతినిధి చెప్పారు. ఈ విషయంలో మీడియాముందు మాట్లాడొద్దని తమ న్యాయవాది సూచించారని మాత్రమే చెప్పినట్లు తెలిపారు. మరోవైపు మిధున్ రెడ్డి ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలకోసం ఢిల్లీలో ఉన్నందున, అవి ముగిసిన తర్వాత అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సీసీ టీవీ ఫుటేజ్‌పై జగన్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సీసీ టీవీ ఫుటేజ్‌ను, మొత్తం వ్యవహారంపై ఇండియా టుడే టీవీ కథనాన్ని కింద చూడొచ్చు.
For all the live updates and Box office information, follow us at @telugu360 https://twitter.com/telugu360
[youtube https://www.youtube.com/watch?v=qPwczJoMURg&w=560&h=315]