భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మళ్ళీ మరో విజయం సాధించింది. ఈరోజు శ్రీహరి కోటలోని షార్ అంతరిక్ష ప్రయోగం నుండి సాయంత్రం 6.00 గంటలకు ప్రయోగించిన పియస్ఎల్వి-సి 29 ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపట్టింది. ఈసారి ప్రయోగంలో విశేషం ఏమిటంటే అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ఆరు ఉపగ్రహాలు కూడా సింగపూర్ కి చెందినవే. కనుక అంతరిక్ష వాణిజ్యంలో భారత్ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించినట్లే భావించవచ్చును. ఈరోజు నుండి పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టినట్లు అయింది. ఇంతవరకు ఇస్రో సంస్థ మొత్తం 51 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టిం బారీ ఆదాయం సమకూర్చుకొంది. అనేక చిన్నాపెద్దా దేశాలు తక్కువ ఖర్చుతో తమ ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టగల విశ్వసనీయమయిన సంస్థల కోసం చూస్తున్నాయి. ఇస్రో సంస్థ తన విజయవంతమయిన ప్రయోగాలతో వాటి నమ్మకాన్ని పొందగలిగింది.