మైనా (ప్రేమఖైదీ), నాన్న సినిమాలతో సౌత్ లో క్రేజ్ సంపాధించిన హీరోయిన్ అమలా పాల్. అనతి కాలంలోనే ప్రేక్షకుల్లో లెక్క లేనంత అభిమానాన్ని సంపాధించిన ఈ హీరోయిన్ రెండు సంవత్సరాల క్రితమే దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. అయితే పెళ్లైనా సినిమాలు చేస్తా అని స్టేట్ మెంట్ ఇచ్చిన అమ్మడు చెప్పినట్టుగానే వరుసెంట సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ మధ్యే పసంగ-2 సినిమాలో నటించిన అమలా తెలుగులో కూడా ఓ సినిమా గురించి మాట్లాడుతున్నారని తెలిసింది.
అయితే సాధారణంగా క్రేజ్ మీద ఉన్నప్పుడు పారితోషికం డిమాండ్ చేయడంలో అర్ధముంది కాని అమ్మడు పెళ్లైనా సరే పసంగ-2లో నటించడానికి కొటిన్నర పారితోషికం అడిగిందట. చిన్న పిల్లలతో తీసిన ఆ సినిమాకు అమలా అంత డిమాండ్ చేయడం ఆశ్చర్యంగానే ఉన్నా ఆమె అడిగినంత ఇచ్చి సినిమాలో నటింపచేసారు. అయితే సినిమాలో సూర్య, అమాల పాల్ అతిథి పాత్రలు చేశారు.
సూర్య తన 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో ఈ సినిమా నిర్మించడం విశేషం. అమలా ఈ సినిమాలో చేసిన రోల్ చాలా ప్రాముఖ్యత ఉంటుందని అంటుంది. పాత్ర ఎలా ఉన్నా సరే పెళ్లైనా అమ్మడి డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని నోరు వెళ్లబెడుతున్నారు కోలీవుడ్ సిని జనాలు.