టాలీవుడ్ లో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉంటూనే వస్తుంది. సరిగ్గా పది సినిమాలు చేస్తే చూసిన కథానాయికనే మళ్లీ మళ్లీ చూసేందుకు ఇష్టపడరు మన ప్రేక్షకులు. అందుకే సినిమాకో కొత్త కథానాయికను, కొత్త అందాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. అయితే టాలీవుడ్ లో హీరోయిన్స్ ని పరిచయం చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరచుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేస్తే ఇక ఆ అమ్మడికి తిరుగుండదనే చెప్పాలి.
ప్రస్తుతం పూరి దర్శకత్వంలో నిన్న విడుదలైన ‘లోఫర్’ సినిమాతో ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది దిశా పటాని. మోడల్ గా ఉన్న అమ్మడిని తెచ్చు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పక్కన మౌనిగా నిలబెట్టాడు జగన్. సినిమా టాక్ ఎలా ఉన్నా పూరి ఇచ్చిన అవకాశన్ని నూటికి నూరు శాతం ఉపయోగించుకుంది అమ్మడు. సినిమాలో కొన్ని హాట్ సీన్స్ లో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది.
మరి చూస్తుంటే అమ్మడికి టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉన్నట్టే కనపడుతుంది. దిశా దశ మార్చడంలో పూరి సక్సెస్ అయ్యాడా లేడా అన్నది ఈ హాట్ బ్యూటీ కొట్టే ఛాన్సులని బట్టి ఉంటుంది. సినిమాలో కథ, కథనాలు ఎలా ఉన్నా వరుణ్ తేజ్, దిశా పటానిల జంట ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యేలా చేసింది.