హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి, సంచలనం సృష్టించిన కాల్‌మనీ వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి సికింద్రాబాద్ బొల్లారం రాష్ట్రపతినిలయంలో విడిది చేసిఉన్న ప్రణబ్‌ను కలిశారు. కాల్‌మనీ – సెక్స్ రాకెట్ కేసుతో పాటు ఏపీ అసెంబ్లీనుంచి రోజమ్మ సస్పెన్షన్ వ్యవహారం, బాక్సైట్ తవ్వకాల వివాదం, ఏపీ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయకపోవటం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయాల గురించి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రపతికి, గవర్నర్‌కు ఫిర్యాదులు చేయటం వల్లన మీడియాలో ప్రచారం తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండదన్న సంగతి తెలిసిందే.