మాస్ మహరాజ్ రవితేజ, క్లాస్ హీరోయిన్ అమీ జాక్సన్ ఇప్పుడు వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు. బెంగాల్ టైగర్ హిట్ తో కాస్త ఊపిరి పీల్చుకున్న రవితేజ తన తర్వాత సినిమా దిల్ రాజుతో ముహుర్తం పెట్టేశాడు అయితే ఆ సినిమాకు కాస్త ఆలస్యం అవుతుందని కొత్త దర్శకుడు చక్రితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.
దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా హాట్ బ్యూటీ అమీ జాక్సన్ ని అడుగుతున్నారని తెలిసింది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో ఫుల్ క్రేజ్ మీదున్న అమీ ఇటీవల ధనుష్ తో నటించిన తంగ మగన్ అదే తెలుగులో నవమన్మదుడు సినిమాలో నటించి అలరించింది. తెలుగులో చరణ్ ఎవడు సినిమాలో మెరిసిన ఈ సుందరి ఇప్పుడు రవితేజ సినిమా కోసం ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట దర్శక నిర్మాతలు. అమీ జాక్సన్ ప్రస్తుతం కొంత టైం కావాలని చెప్పిందట. డేట్స్ అడ్జెస్ట్ అవుతాయా లేదనే విషయం మీదే అమ్మడు సినిమాలో నటించేది లేనిది త్వరలో చెబుతా అన్నదట.
అయితే చిత్ర యూనిట్ చెబుతున్న వార్తల ప్రకార రవితేజ సరసన అమీ జాక్సన్ జత కట్టడం కన్ఫాం అంటున్నారు. కొత్త దర్శకుడు చక్రి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిన రవితేజ ఈ సినిమాను కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడట. మరి క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.